ముంబై, ఆగస్టు 8: రిలయన్స్ జియో తమ పాపులర్ ఓటీటీ-పాస్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూ సరికొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. శుక్రవారం నుంచే వీటి రీచార్జ్‌లు అందుబాటులోకి వచ్చాయి. మైజియో యాప్, జియో వెబ్సైట్, ఆథరైజ్డ్ రిటైల్ ఔట్లెట్ల ద్వారా తీసుకోవచ్చు. ప్రతీ జియో ఓటీటీ-పాస్ బండిల్ కొనుగోలుదారులకు అన్లిమిటెడ్ 5జీతో యూట్యూబ్ ప్రీమి యం, అమెజాన్ ప్రైమ్, జియోహాట్‌స్టార్ మొబైల్-హాలీవుడ్ సహా 15 ప్రీమియం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు అనుమతి ఉం టుంది. జియోటీవీ యాప్ ద్వారా వెయ్యికిపైగా చానళ్లను చూడవచ్చు. రూ.1,500కుపైగా విలువైన నెలవారీ ప్రయోజనాలుంటాయి. వాయిస్-ఓన్లీ ప్యాక్‌లు మినహా మిగతా యాక్టివ్ యూజర్లు తీసుకోవచ్చు.
రూ.200 ఓటీటీ పాస్: దీని వ్యాలిడిటీ 28 రోజులు. మొత్తం 30జీబీ హైస్పీడ్ డాటా ఉంటుంది. యాక్టివ్ బేస్ ప్లాన్‌పై జియో యూజర్లు అందరూ తీసుకోవచ్చు.
రూ.550 ఓటీటీ పాస్: దీని చెల్లుబాటు వ్యవధి 84 రోజులు. మొత్తం 90జీబీ హైస్పీడ్ డాటా. ఈ ప్లాన్ 3 నెలలు లేదా ఏడాది బేస్ ప్లాన్లు తీసుకున్న జియో వినియోగదారులకే అందుబాటులో ఉంటుంది.రూ.2,000 ఓటీటీ పాస్: దీని గడువు 365 రోజులు. 365జీబీ హైస్పీడ్ డాటా. ఏడాది యాక్టివ్ సబ్స్క్రిప్షన్ యూజర్లకే ఈ ప్లాన్ లభిస్తుంది.