Kapu Seethalakshmi | కొత్తగూడెం అర్బన్, మార్చి 5 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మహిళలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాలని కొత్తగూడెం మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
అలవి గానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేదని, కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తానన్న సీఏం రేవంత్ రెడ్డి సర్వే పేర్లతో కాలయాపన చేస్తూ మహిళలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
మహిళలకు రూ.2,500, 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థికి స్కూటీ ఇస్తానని, కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తానని ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కి మోసం చేశారని విమర్శించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 8 వ తేదీ లోపు హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీకి పోస్ట్ కార్డు లు రాసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు తోగరు రాజశేఖర్, వేముల ప్రసాద్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ. హుస్సేన్, రామిళ్ల మధు బాబు, లావుడ్య సత్యనారాయణ, మూడ్ జయరాం, జీ.శ్రీనివాస్, సురేందర్, మద్దెల సుధీర్, షమ్మి, ఖాజా, రాణి, భారతి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు