Singer Kalpana | ప్రముఖ నేపథ్య గాయని సింగర్ కల్పనా రాఘవేందర్ (Kalpana Raghavendar) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి కేపీహెచ్‌బీలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో (Holistic Hospitals) చేరారు. అప్పటి నుంచి గాయనికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు కల్పన హెల్త్ బులెటిన్‌ను తాజాగా విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
‘గాయని కల్పన నిద్రమాత్రలు మింగారు. ఆమెను అపస్మారక స్థితిలో మంగళవారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి అస్థిరంగా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ప్రస్తుతం వెంటిలేటర్ తీసేశాం. లంగ్ ఇన్ఫెక్షన్ కూడా ఉంది. అందుకే ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నాం. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉంది. పరిస్థితిని బట్టి రెండు లేదా మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం’ అని డాక్టర్ చైతన్య తెలిపారు.
కాగా, కల్పన ఆత్మహత్యాయత్నానికి సంబంధించి ఆమె కూతురు కారణం అని తెలుస్తుంది. టాలీవుడ్ సినీ వర్గాల ప్రకారం.. నిన్న కేరళ నుంచి కల్పన హైదరాబాద్‌కి రాగా.. అనంతరం తన కూతురితో ఫోన్ మాట్లాడుతూ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తుంది. తన కూతురిని హైదరాబాద్‌కి రమ్మని కోరగా.. ఆమె తిరస్కరించడంతో డిప్రెషన్లోకి వెళ్లిన కల్పన సుసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలుస్తుంది. మోతాదుకు మించి ట్యాబెట్లు వేసుకున్నట్లు సమాచారం. అనంతరం చెన్నైలో ఉన్న తన భర్తకు కల్పనకోవడంతో కల్పన అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సాయంత్రం 5:00 గంటల సమయంలో ఆమె భర్త ప్రసాద్ ఫోన్ చేసినప్పుడు కల్పన స్పందించలేదు. దీంతో ఆయన విల్లా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విల్లా సెక్రటరీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చిన వెంటనే కల్పనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
టాలీవుడ్లో అత్యంత పాపులర్ సింగర్ కల్పన ఒకరు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేవీ మహాదేవన్‌తో కలిసి ఆమె ఎన్నో మధురమైన పాటలు ఆలపించారు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Also Read..
Singer Kalpana | సింగర్ కల్పన స్టేట్మెంట్ని రికార్డు చేసిన పోలీసులు
Singer Kalpana | సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణం అదేనా.!
Kalpana| సింగర్ కల్పన భర్త ఎవరు, ఆయనతో ఎందుకు దూరంగా ఉంటుంది..!
Singer Kalpana | పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త.. ఆమె ఆరోగ్యం ఇప్పుడెలా ఉందంటే..