Kalpana| తన వాయిస్‌తో సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తున్న కల్పన తాజాగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. ఆమె హైదరాబాద్ లోని నిజాంపేటలో కొద్ది కాలంగా నివాసం ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేశారు. రెండు రోజులుగా కల్పన తలుపులు తీయక పోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి తలుపులు పగలగొట్టి అపస్మారక స్థితిలో ఉన్న కల్పనని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉందని అంటున్నారు. అయితే కల్పన సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటిగా కూడా సత్తా చాటింది. బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని సందడి చేసింది.
ఏఆర్ రెహమాన్, ఇళయారాజా, ఎస్పీ బాలు, కేవీ మహదేవన్, చిత్ర వంటి ప్రముఖ గాయనీగాయకులతో కలిసి ఎన్నో పాటలు ఆలపించింది కల్పన. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా స్టార్ సింగర్‌గా రాణిస్తున్న కల్పన సూసైడ్ అటెంప్ట్ చేసిన నేపథ్యంలో ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కల్పన తండ్రి టీఎస్ రాఘవేంద్ర ప్రముఖ గాయకుడు కాగా, ఆమె తల్లి సులోచన కూడా గాయకురాలు. ఆమెకి తమ్ముడు షికినా షాన్ కూడా ఒక ఒపెరా సింగర్. ఇక ఐదేళ్ల వయసులోనే సాలూరు వాసురావు చే కూర్చిన `కుటుంబం` సినిమాలో పాట కోసం తన గాత్రం దానం చేసింది. ఇక అప్నటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలనటిగా ముప్పైకి పైగా చిత్రాల్లో నటించిన కల్పన మూడు వేలకుపైగా పాటలు ఆలపించారు
జీవితంలో ఉన్నతంగా ఎదిగినప్పటికీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడింది.ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు కూడా ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. అయితే కల్పన భర్త పేరు ప్రసాద్ ప్రభాకర్ కాగా, ఆయన ఒక వ్యాపారవేత్త అని తెలుస్తుంది. 19 ఏళ్ల కూతురిని చూసుకుంటూ చెన్నైలో ఉంటాడట. ఆమె బాగోగులు అన్ని కూడా ప్రభాకర్ చూసుకుంటాడట. అయితే కల్పన సింగర్‌గా ఎదగడం ప్రభాకర్‌కి నచ్చదని, ఈ క్రమంలో ఆమెని చాలా టార్చర్ చేశాడని, అందుకే అతనికి దూరంగా కల్పన జీవిస్తున్నట్టు తెలుస్తుంది. కల్పన ఆత్మహత్యయత్నానికి పాల్పడం వెనుక ఆమె భర్తనే ఉన్నాడా? అనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే వీటిపై క్లారిటీ రానుంది.