MLA Padi Kaushik Reddy | హుజురాబాద్ పట్టణంలో డంపింగ్ యార్డ్ పెడుతున్నరు. ఎట్టి పరిస్థితుల్లో ఆ డంపింగ్ యార్డ్‌ను హుజురాబాద్‌లో పెట్టడానికి వీలు లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. అసెంబ్లీ సాక్షిగా నేను డిమాండ్ చేసిన. ఏప్రిల్ 4న ఈ డంపింగ్ యార్డుపై హుజురాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడదామని ప్లాన్ చేసుకుంటే.. దాన్ని అడ్డుకోవాలని నాకు కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారు.
నువ్వు ఖచ్చితంగా సీబీసీఐడీ ఆఫీస్‌కు వచ్చి హాజరుకావాలి.. ఎందుకు హుజురాబాద్ డంపింగ్ యార్డ్ వద్దు అని నేను పోరాటం చేయొద్దా..? నేను అక్కడ పోరాటం చేస్తా అని అనుకోగానే నాకు సీఐడీ నోటీసులు ఇస్తరా..? 4 కాకపోతే 5, 6వ తేదీలకు ఇయ్యండి. సరే నేను చట్టాన్ని గౌరవించి 4వ తేదీన వస్తా.. 5,6, 7 రోజు పెట్టుకుంటా.. ఎట్లా అపుతవ్.. అసలు డంపింగ్ యార్డ్ మా హుజురాబాద్‌లో ఎందుకు పెట్టాలే. అటు కరీంనగర్లో ఉన్న చెత్తంతా, హనుమకొండ, వరంగల్‌లో ఉన్న చెత్తంతా తీసుకొచ్చి హుజురాబాద్‌లో పెడతారా..? అని ప్రశ్నించారు.
మణికొండలో ఉన్న ప్లాంట్‌ను తీసుకొచ్చి హుజురాబాద్‌లో ఎందుకు పెడుతున్నరు.. ఎవరు చేయమన్నరు హుజురాబాద్‌లో.. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ పెడతామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.
హుజూరాబాద్ పట్టణం నడిబొడ్డున డంపింగ్ యార్డు పెడుతున్నారు, అది పెట్టడానికి వీలులేదు
ఏప్రిల్ 4న డంపింగ్ యార్డుపై నేను హుజురాబాద్‌లో నిరసన కార్యక్రమం పెడితే, దాన్ని అడ్డుకోవాలని కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారు – పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/4aw97tK8Cw
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2026