Watermelon Seeds | పుచ్చకాయ విత్తనాలను తిన్నా, మింగినా ప్రమాదకరమా..? వైద్యులు ఏం చెబుతున్నారు..?
ఎండలు మండే మధ్యాహ్నంలో చల్లని పుచ్చకాయ ముక్కను ఆస్వాదిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక నల్ల గింజ మింగేయడం చాలా మందికి సాధారణమే. పుచ్చకాయ గింజలను పూర్తిగా వేరుచేయడం కష్టమే కావడంతో ఇది తరచూ జరుగుతుంది. అయితే గింజలు మింగితే ప్రమాదమని ఉన్న అపోహకు ఇప్పుడు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది.
Watermelon Seeds | ఎండలు మండే మధ్యాహ్నంలో చల్లని పుచ్చకాయ ముక్కను ఆస్వాదిస్తున్నప్పుడు అనుకోకుండా ఒక నల్ల గింజ మింగేయడం చాలా మందికి సాధారణమే. పుచ్చకాయ గింజలను పూర్తిగా వేరుచేయడం కష్టమే కావడంతో ఇది తరచూ జరుగుతుంది. అయితే గింజలు మింగితే ప్రమాదమని ఉన్న అపోహకు ఇప్పుడు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. నిజానికి మన జీర్ణవ్యవస్థ గింజలు మొలకెత్తే స్థలం కాదు. పైగా మనం విసిరేస్తున్న ఈ గింజలు అసలు పోషకాహార నిధులు అని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయ గింజలు పూర్తిగా సురక్షితమే. వాటిని అలాగే మింగితే అవి ఫైబర్‌లా పని చేసి జీర్ణవ్యవస్థలో పెద్దగా మార్పులేకుండా బయటకు వెళ్లిపోతాయి. కానీ వీటిని సరైన విధంగా తీసుకుంటే అసలు పోషక విలువలు అందుతాయి. భారతీయ వంటకాలలో ఇతర గింజలను మిఠాయిల్లో, కర్రీల్లో వాడే సంప్రదాయం ఉన్నప్పటికీ పుచ్చకాయ గింజలు మాత్రం ఎక్కువగా వృథా అవుతున్నాయి. అయితే పోషకాహార నిపుణులు మొక్కల ఆధారిత ప్రోటీన్, ఖనిజాలను పెంచుకోవడంలో ఇవి ఉపయోగకరమని సూచిస్తున్నారు.
అనేక పోషకాలకు నెలవు..
చిన్నవిగా కనిపించినా పుచ్చకాయ గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రోటీన్ పరంగా ఇవి మంచి మూలం అని చెప్పవచ్చు. సుమారు 30 శాతం వరకు ప్రోటీన్ ఉండి, అర్జినిన్ అనే అమినో ఆమ్లం గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. వీటిలో ఉన్న మంచి కొవ్వులు (మోనో, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్) చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మెగ్నీషియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇవి సహజ పరిష్కారంగా ఉపయోగపడతాయి. పుచ్చకాయ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. వేసవిలో శరీరానికి హైడ్రేషన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు చర్మాన్ని రక్షించి మెరుపును పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి ఇవి మద్దతు ఇస్తాయి. వేడి కాలంలో గుండెపై పడే ఒత్తిడిని తగ్గించడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలో ఉండే బి విటమిన్లు మెటబాలిజాన్ని మెరుగుపరచి ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. మధ్యాహ్నం అలసటను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
ఎలా తినాలి..?
పుచ్చకాయ గింజలు మేలు చేసేవే అయినప్పటికీ వీటిని నేరుగా మింగకూడదు. వీటిని అలాగే మింగడం హానికరం కాకపోయినా పూర్తి ప్రయోజనం అందదు. గింజల పై పొర గట్టిగా ఉండటం వల్ల వాటిని ప్రాసెస్ చేయడం మంచిది. మొలకెత్తించడం (స్ప్రౌటింగ్) ఉత్తమ పద్ధతి. రాత్రంతా నానబెట్టి, రెండు రోజులు మొలకలు వచ్చాక ఎండబెట్టి లేదా వేయించుకుని తినవచ్చు. సులభంగా తినాలంటే గింజలను శుభ్రం చేసి, కొద్దిగా నెయ్యి లేదా నూనెలో వేసి ఉప్పు, కారం, ఆమ్ చూర్ వేసి వేయించుకోవచ్చు. ఇవి సన్‌ఫ్లవర్ గింజల మాదిరిగా రుచిగా ఉంటాయి. పొహా, ఉప్మా, సలాడ్స్ లేదా స్మూతీలలో కూడా వీటిని కలుపుకోవచ్చు. అయితే మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. ఎక్కువగా తీసుకుంటే ఫైబర్ కారణంగా పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు వేయించిన లేదా మొలకెత్తించిన గింజలనే తీసుకోవాలి. ఇవి అధిక కాలరీలతో కూడినవిగా ఉండటంతో రోజుకు చిన్న మోతాదులో (25-30 గ్రాములు) తీసుకుంటే సరిపోతుంది. ఈ వేసవిలో పుచ్చకాయ గింజలను వృథా చేయకుండా ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి సహజంగా శక్తి, పోషణ లభిస్తుంది. చిన్న గింజలలో దాగి ఉన్న పెద్ద ప్రయోజనాలను గుర్తించి వాటిని ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
Explosion In Building | నిర్మాణంలో ఉన్న భవనంలో పేలుడు.. ఐఈడీగా పోలీసులు అనుమానం
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో లోయలో పడ్డ బస్సు.. ఇద్దరు మృతి.. 15 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

