Donald Trump | నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్టును రూపొందిస్తున్న అమెరికా.. సవాళ్లు ఎదురవుతాయంటున్న నిపుణులు
Donald Trump | అమెరికా కొత్తగా నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ (National voter list) ను రూపొందిస్తున్నది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం పనులు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు.
Donald Trump : అమెరికా (USA) కొత్తగా నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్ట్ (National voter list) ను రూపొందిస్తున్నది. ఈ మేరకు అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం పనులు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల జాబితాను రూపొందించాలనే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం కూడా చేశారు. ఈ ఏడాది జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్‌పై మరిన్ని ఆంక్షలు విధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ నేషనల్ ఎలిజిబుల్ ఓటర్ లిస్టు రూపకల్పనలో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం.. సోషల్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి ప్రతి రాష్ట్రంలో అర్హులైన ఓటర్ల జాబితాను తయారుచేయనుంది. ట్రంప్ తాజా ఉత్తర్వుల ప్రకారం.. బ్యాలెట్లను ట్రాక్ చేయడానికి ప్రత్యేకమైన బార్కోడ్లు ఉన్న సురక్షితమైన ఎన్వలప్‌లు ఉండేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రాలు ఆమోదించిన ఓటర్ల జాబితాలో లేని వారికి యూఎస్ పోస్టల్ సర్వీస్ ఆబ్సెంటి బ్యాలెట్లను పంపకుండా నిరోధించే ఆలోచన చేస్తున్నారు.
మెయిల్-ఇన్ ఓటింగ్‌ను సైతం ట్రంప్ వ్యతిరేకిస్తున్నట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. అయితే రాష్ట్రాలు నిర్వహించుకునే ఎన్నికల్లో దేశాధ్యక్షుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నందున అమెరికా ప్రభుత్వం చట్టపరంగా సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్‌టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

