Love Insurance Kompany | తమిళ యువ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకుని ‘U/A’ సర్టిఫికెట్ అందుకున్న ఈ చిత్రం, అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ 10, 2026న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తెలుగులో టీజర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 2040వ సంవత్సరం నేపథ్యంలో సాగే ఒక ఆసక్తికరమైన ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ డ్రామాగా కనిపిస్తోంది. ప్రస్తుత కాలంలోని ఇన్స్టంట్ రిలేషన్ షిప్స్‌ను ఇష్టపడని హీరో(ప్రదీప్ రంగనాథన్) హీరోయిన్ (కృతి శెట్టి), పాతకాలం నాటి స్వచ్ఛమైన ప్రేమను కోరుకుంటారు. అయితే వీరి ప్రేమకథకు ఎస్. జే సూర్య ఎలా అడ్డుపడతాడు. ఎస్. జే సూర్య నడుపుతున్న ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే సంస్థ ఉద్దేశ్యం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో ప్రేమ గురించే కాకుండా 2040లో ఏం మార్పులు రాబోతున్నాయి అనే చిన్న చిన్న విషయాలను కూడా చాలా చక్కగా చూపించారు మేకర్స్. యోగి బాబు, సీమన్, గౌరీ కిషన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నఈ చిత్రాన్ని లేడీ సూపర్ స్టార్ నయనతారతో కలిసి ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ‘శ్రీ పద్మిని సినిమాస్’ సంస్థ రిలీజ్ చేస్తోంది.