కమాన్ పూర్, ఫిబ్రవరి 11: కమాన్ పూర్ మండలంలోని రొంపకుంట గ్రామానికి చెందిన కొయ్యడ రాజయ్య (53) అనే గొర్రెల కాపరి సోమవారం రాత్రి పాము కాటుకు గురై మృతి(Shepherd dies) చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామగుండం మండలం లక్ష్మీపురం శివారులో గొర్లను మేపడం కోసం మంద ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో మంద ఏర్పాటు చేసుకున్న ప్రదేశం పక్కన నేలపై సదరు గొర్ల కాపరి నిద్రించాడు.
ఈ క్రమంలో పాము కాటు వేయడంతో సదరు వ్యక్తి నిద్రలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య స్వరూప, కుమారులు రమేష్, సంజీవ్ ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా దవండి..
Hamas | ట్రంప్ ఆ సంగతి తప్పక గుర్తుంచుకోవాలి.. అమెరికా అధ్యక్షుడి హెచ్చరికకు హమాస్ రెస్పాన్స్
Karimnagar | హనుమాన్ మాలధారణతో మోసం.. దొంగ బాబాకు దేహశుద్ధి