Fruits For Weight Gain | అధికంగా బరువు ఉన్నవారు దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కొవ్వు కరిగేందుకు అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. డైట్‌ను పాటిస్తుంటారు. అయితే కొందరు ఎంత తిన్నా బరువు పెరగరు. బక్క పలుచగా, సన్నగా ఉంటారు. దీంతో తమ శరీర ఆకృతిని చూసి వారు ఫీలవుతుంటారు. బరువు ఎలాగైనా సరే పెరగాలని చూస్తుంటారు. కానీ బరువు పెరగలేకపోతుంటారు. ఇందుకు గాను జంక్ ఫుడ్‌ను సైతం అధికంగా తింటుంటారు. అయితే బక్క పలుచగా ఉన్నవారు బరువు పెరగాలని చూడడం కరెక్టే. కానీ అందుకు జంక్ ఫుడ్‌ను తినకూడదు. ఆరోగ్యకరమైన రీతిలో బరువు పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని రకాల పండ్లు బరువును పెంచేందుకు సహాయం చేస్తాయి. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంత సన్నగా ఉన్నవారు అయినా సరే బరువు పెరుగుతారు. ఇక ఆ పండ్లు ఏమిటంటే..
మామిడి పండ్లు వేసవి సీజన్లోనే లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం వేసవి సీజన్ మొదలు కాబోతోంది. కనుక ఈ సీజన్లో లభించే మామిడి పండ్లను తినడం వల్ల బరువు పెరగవచ్చు. 100 గ్రాముల మామిడి పండ్లను తింటే సుమారుగా 60 క్యాలరీల శక్తి లభిస్తుంది. బరువును పెంచడంలో మామిడి పండ్లు ఎంతగానో సహాయం చేస్తాయి. ఈ పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. మామిడి పండ్లను అధిక మొత్తంలో తింటే బరువు పెరుగుతారు. అయితే వేడి శరీరం ఉన్నవారు ఈ పండ్లను అధికంగా తినకూడదు. దీంతో విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక అలాంటి వారు గ్యాప్ ఇచ్చి ఈ పండ్లను తింటుండాలి. దీంతో ఆరోగ్యకరమైన రీతిలో బరువును పెంచుకోవచ్చు.
బరువును పెంచడంలో అరటి పండ్లు కూడా ఎంతో దోహదం చేస్తాయి. 100 గ్రాముల అరటి పండ్లను తింటే 89 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పండ్లలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అరటి పండ్లను రోజూ తింటే బరువు సులభంగా పెరుగుతారు. సీతాఫలాలు కూడా బరువును పెంచగలవు. 100 గ్రాముల సీతాఫలాలను తింటే 94 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పండ్లలోనూ చక్కెర అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తింటే క్యాలరీలు అధికంగా లభిస్తాయి. దీంతో బరువు పెరుగుతారు. ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయి కదా అని చెప్పి చాలా మంది తినరు. కానీ బరువు పెంచేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ పండ్లను 100 గ్రాములు తింటే 67 క్యాలరీల శక్తి లభిస్తుంది. ద్రాక్ష పండ్లలో తియ్యగా ఉండే పండ్లను తినాలి. ఆకుపచ్చ రంగు ద్రాక్షలు తియ్యగా ఉంటాయి. కనుక వీటిని తింటే బరువును పెంచుకోవచ్చు.
సపోటా పండ్లను తింటున్నా కూడా బరువు పెరుగుతారు. 100 గ్రాముల సపోటాలను తింటే 83 క్యాలరీల శక్తి లభిస్తుంది. సపోటా పండ్లలో అధిక మొత్తంలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి అధికంగా క్యాలరీలను అందిస్తాయి. బరువు పెరిగేలా చేస్తాయి. పనస పండ్లలో కార్బొహైడ్రేట్లు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. తరచూ ఈ పండ్లను తింటున్నా కూడా బరువు పెరుగుతారు. 100 గ్రాముల పనస పండ్లను తింటే 95 క్యాలరీల శక్తి లభిస్తుంది. బరువు పెరిగేందుకు ఇవి కూడా చక్కగా దోహదం చేస్తాయి. ఖర్జూరాలను తింటున్నా కూడా బరువును పెంచుకోవచ్చు. 100 గ్రాముల ఖర్జూరాలను తింటే సుమారుగా 282 క్యాలరీల శక్తి లభిస్తుంది. ఈ పండ్లను తింటే క్యాలరీలు అధికంగా లభిస్తాయి. సులభంగా బరువు పెరుగుతారు. అయితే ఈ పండ్లను తినడంతోపాటు రోజూ వ్యాయామం చేస్తుంటే ఆరోగ్యకరమైన రీతిలో బరువును పెంచుకోవచ్చు. దీంతో చక్కని దేహాకృతి కూడా సొంతమవుతుంది.