తిమ్మాపూర్,ఫిబ్రవరి11 : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి(Mannempally) గ్రామంలో హనుమాన్ మాలధారణలో ప్రజలను మోసం చేస్తున్నారన్న అనుమానంతో గ్రామస్థులు ఓ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి. హనుమాన్ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి గ్రామానికి వచ్చి కిరాణా షాపులో మహిళను కలిశాడు. ఆమెకు దోషం ఉందని నమ్మబలికి ఒక తాయత్తు కట్టారు.
ఆమె మైకంలోకి జారుకున్న తర్వాత కొంత నగదును ఫోన్ పే కొట్టించుకొని పరారయ్యాడు. వెంబడించిన గ్రామస్థులు మల్లాపూర్లో దొంగ బాబాను(Thief baba) పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎల్ఎండీ పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.