Drinking Water | కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో సరఫరా అవుతున్న మంచినీటిని ఈ వేసవి కాలంలో వృధా కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేకంగా టాస్క్ఫోర్స్ను సైతం ఏర్పాటు చేశారు. నగరంలో ఆయా ప్రాంతాల్లో మంచినీటి సరఫరా జరిగిన సమయంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యను గుర్తించాలని నగర కమిషనర్ పేర్కొన్నారు.
నల్లాలకు బిరడాలు బిగించకుండా నీటిని వృధా చేస్తున్న ఇంటి యజమానులను గుర్తించి.. వారికి 500 రూపాయల జరిమానా విధించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఇంటి యజమాని నల్లాలకు బిరడాలు బిగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ పేర్కొన్నారు.
S Jaishankar | అధిక సుంకాలతో భారత్ – అమెరికా వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి.. జై శంకర్ ఏమన్నారంటే..?
Bandlaguda Jagir | చెత్త బండ్లగూడ.. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంపై పట్టింపేది?
Janhvi Kapoor| రామ్ చరణ్ కొత్త సినిమా నుండి జాన్వీ లుక్ రిలీజ్.. ఒక్కసారిగా పెరిగిన అంచనాలు