S Jaishankar | తమ దేశ వస్తూత్పత్తులపై అధిక సుంకాలు వేస్తున్న దేశాలపై త్వరలో ప్రతీకార సుంకాలు తప్పవంటూ గతకొద్ది రోజులుగా హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. అన్నంత పనికి రెడీ అయ్యారు. ఏప్రిల్ 2 నుంచి భారత్, చైనా సహా మరికొన్ని దేశాలపై అధిక సుంకాలుంటాయని అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ ప్రకటనతో భారత్ – అమెరికా (India – America) దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితిపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (S Jaishankar) స్పందించారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆవశ్యకతపై పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు తెలిపారు.
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జై శంకర్ బుధవారం సాయంత్రం ఛాఠమ్ హౌస్ (Chatham House)లో నిర్వహించిన అధికారిక సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత్‌పై అమెరికా అధిక టారిఫ్‌లు విధించడంపై స్పందించారు. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. శక్తివంతమైన దేశాలకు సమాన హక్కులు ఉండే విధానం దిశగా ట్రంప్ ముందుకు సాగుతున్నారన్నారు. ఇది భారత్‌కు అనుకూలంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నట్లు చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందం ఆవశ్యకతపై ఇరు దేశాలు పరస్పరం అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు.
Also Read..
Donald Trump | భారత్‌పైనా బాదుడే.. ఏప్రిల్ 2 నుంచి సుంకాలు: డొనాల్డ్ ట్రంప్
S Jaishankar | జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కేంద్ర మంత్రిపై దాడికి ఖలిస్థానీల యత్నం
Donald Trump | ఇదే మీకు చివరి హెచ్చరిక.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్