Donald Trump | బందీల (Hostages) విడుదలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హమాస్ (Hamas Rebels) గ్రూప్‌కు మరోసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ చెరలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయాలన్నారు. లేదంటే హమాస్ అంతు చేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే తన చివరి హెచ్చరిక అని పేర్కొన్నారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు.
‘మీ చెరలో ఉన్న బందీలందరినీ వెంటనే విడుదల చేయండి. అలాగే మీరు హత్య చేసిన వ్యక్తుల మృతదేహాలను తిరిగి అప్పగించండి. లేదంటే మీ అంతు చూస్తా. అందుకు ఇజ్రాయెల్‌కు కావాల్సిన ప్రతిదాన్ని పంపుతాను. నేను చెప్పింది చేయకుంటే.. ఒక్క హమాస్ సభ్యుడు కూడా మిగలడు. మీ చెరలో బందీలుగా ఉండి ఇటీవల విడుదలైన వారిని నేను కలిశాను. ఇదే మీకు చివరి హెచ్చరిక. గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు వేచి చూస్తోంది. మీరు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టండి’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని (Gaza hostage release) అల్టిమేటం జారీ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా 2025 జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. ఈలోపు బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేదంటూ నరకం చూస్తారని, గతంలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇలా హమాస్‌కు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు.
Also Read..
America | బందీలను విడిపించేందుకు.. హమాస్‌తో అమెరికా రహస్య చర్చలు!
China | యుద్ధం కావాలంటే సిద్ధమే.. ట్రంప్ ట్రేడ్‌వార్‌పై చైనా రియాక్షన్
S Jaishankar | జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. కేంద్ర మంత్రిపై దాడికి ఖలిస్థానీల యత్నం