వేములవాడ : రాజన్న ఆలయంలో(Rajanna Temple) టెండర్లు దక్కించుకొని తదుపరి నగదు చెల్లించకుండా ఇబ్బంది పేడుతున్న కాంట్రాక్టర్ల పట్ల ఇక కఠినంగా వ్యవహరిస్తామని రాజన్న ఆలయం ఈవో వినోద్ రెడ్డి( Vinod Reddy) తెలిపారు. శుక్రవారం రాజన్న ఆలయ ఈవో కార్యాలయంలో పలు విభాగాలకు టెండర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లతో ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నగదు చెల్లించడంలో మొండికేస్తున్నారని తెలిపారు.
ఇకపై రాజన్న ఆలయానికి బకాయి పడితే ఆలయంలో దక్కించుకున్న కాంట్రాక్ట్, స్వామివారికి బాకీ పడిన వివరాలతో పాటు హక్కులు దక్కించుకున్న పూర్తి చిరునామాతో కూడిన వివరాలను బహిరంగంగా పరుస్తామని వెల్లడించారు. ఇందుకు ఆలయ పరిసరాల్లో బోర్డులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రతి రూపాయి స్వామివారికి దక్కాలని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..