President Murmu | పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం కృషి : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Murmu | ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఇందుకు గాను కేంద్రం రూ. 12వేల కోట్లను కేటాయించిందని వెల్లడించారు.
అమరావతి : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) తన ప్రసంగంలో పోలవరం ( Polavaram ) ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె అన్నారు. ఇందుకు గాను కేంద్రం రూ. 12వేల కోట్లను కేటాయించిందని వెల్లడించారు.
గత మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా(Allaince) ఏర్పడి పోటీ చేసి ఘన విజయం సాధించింది. అప్పటి వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. ఏపీ నుంచి 21మంది కూటమి సభ్యులు ఎంపీలుగా గెలిచారు. దీంతో దేశంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటులో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా కూటమి ఆవిర్భవించింది.
అప్పటి నుంచి రాష్ట్రానికి కేంద్రం కొత్త పథకాల మంజూరు, నిధుల కేటాయింపునకు అధిక ప్రాదాన్యం ఇస్తూ వస్తుంది. ఇందులో భాగంగా ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వెంటనే రూ. 12 వేల కోట్లను మంజూరు చేసింది. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్( Visaka Plant ) పునరుద్దరణకు మూడు విడతలుగా మరో రూ. 11,440 కోట్లను మంజూరు చేసింది.
పెండింగ్లో ఉన్న రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కూడా హడ్కో ద్వారా సుమారు రూ. 18వేల కోట్లను రుణంగా ఆయా సంస్థల ద్వారా కేటాయించింది. జాతీయ రహదారుల నిర్మాణం, విశాఖ రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేటాయించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

