Imanvi | గ్లోబల్ స్టార్ యాక్టర్ ప్రభాస్ (Prabhas) బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్ట్ చేస్తున్న `ఫౌజీ`(Fauji). ఈ చిత్రంలో ఇమాన్వీ (Imanvi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా
ప్రభాస్ ఇంటి నుంచి పసందైన రుచులతో కూడిన భోజనం సెట్స్‌కు వస్తుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్ (Prabhas) తన ఆతిథ్యంతో ఊపిరాడకుండా చేస్తాడని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. కాగా ఇప్పుడు ప్రభాస్ ఇంటి విందుకు ఫిదా అయిపోయిన వారి జాబితాలో ఫౌజీ హీరోయిన్ కూడా చేరిపోయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో కొనసాగుతోంది.
సెట్స్‌లో బ్రేక్ టైంలో ప్రభాస్ కిచెన్‌లో వండిన హోం ఫుడ్‌ను ఆరగించింది ఇమాన్వీ. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గ్లింప్స్ షేర్ చేసింది.రుచికరమైన యమ్మీ యమ్మీ భోజనం రుచి చూపించిన ప్రభాస్‌కు ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
సీతారామం, రాధేశ్యామ్ లైన్లో వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫౌజీ సాగనుందట. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో స్పిరిట్, మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలు చేస్తున్నాడు.
#Imanvi BREAKING NEWS – She’s SUPER HAPPY with Food Serve of #Prabhas at #Fauji Shoot 😳😳😳🔥🔥🔥 pic.twitter.com/jsp5qlFELU
— Prabhas (@salaarthesega81) January 31, 2025
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ