Kamal haasan | ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal haasan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి థగ్ లైఫ్. మణిరత్నం డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కమల్ హాసన్‌ను ఓ రిపోర్టర్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ విక్రమ్ 2 గురించి చెప్పాలని అడిగాడు.
అయితే విక్రమ్ 2పై కామెంట్ చేయకుండా.. నేను మరొక స్క్రిప్ట్ సిద్ధం చేశానన్నాడు కమల్ హాసన్. అంతేకాదు ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి కూడా వెళ్తుందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. మరి కమల్ హాసన్ ఎలాంటి కథ రెడీ చేశాడు.. ఇంతకీ ఈ మూవీని స్వయంగా నటిస్తూ.. కమల్ హాసనే డైరెక్ట్ చేస్తాడా..? వేరే వారికి దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తాడా..? అనేది మాత్రం సస్పెన్స్ నెలకొంది.
థగ్‌లైఫ్ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కీలక పాత్రలో నటిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి, త్రిష, గౌతమ్ కార్తీక్, జోజు జార్జ్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
ఈ మూవీని కమల్ హాసన్-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
#Kamalhaasan is Back to Chennai🔥 #ThugLife release on June 5 💥
Journalist ask for is your next flim #Vikram 2 ?
He said “I wrote another script” 😍#VidaaMuyarchi #JanaNayagan #Coolie #Suriya45 #Parasakthi #Chiyaan63 #KaratheyBabu pic.twitter.com/F3SygZHQQh
— வேடிக்கை பார்ப்பவன் (@Vedikaiparpavin) January 31, 2025
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ