Parasakthi Title | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకే టైటిల్‌తో సినిమాలు రావడం కొత్తేమీ కాదు. కొన్ని సార్లు మాత్రం టైటిల్స్ విషయంలో సమస్య ఉండదు.. అయితే అప్పడప్పుడు మాత్రం వార్తల్లో నిలుస్తూ చర్చకు తెరలేపుతాయి. ఇంతకీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. ? తాజాగా ఇద్దరు హీరోలు ఓ టైటిల్‌తో సినిమాలతో రావడం ఇండస్ట్రీ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకొస్తుంటాడు బిచ్చగాడు ఫేం విజయ్ ఆంటోని . ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న 25వ చిత్రం ‘పరాశక్తి’ (Parasakthi). అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను బుధవారం విడుదల చేశారు.
అమరన్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ నటుడు శివ కార్తికేయన్ (Sivakarthikeyan) ఆకాశం నీ హద్దురా ఫేం డైరెక్టర్ సుధా కొంగర (Sudha Kongara)తో తెరకెక్కుతున్న చిత్రం ఎస్కే 25 (SK25) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కూడా పరాశక్తి టైటిల్ ఫిక్స్ చేయగా.. టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్ కూడా విడుదల చేశారు.
అయితే విజయ్ ఆంటోనీ తమిళ్లో ఒక టైటిల్ పెట్టి.. తెలుగు సహా ఇతర భాషల్లో పరాశక్తి టైటిల్ పెట్టడం.. రెండు సినిమాల ప్రకటన కూడా ఒకే రోజు ఉండటంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. సౌత్ సినిమా ఛాంబర్లో ఎప్పుడో పరాశక్తి టైటిల్‌ను రిజిస్టర్ చేయించానని విజయ్ ఆంటోనీ ఓ నోట్ విడుదల చేశాడు. మరో వైపు తాము పరాశక్తి టైటిల్‌ను ఏవీఎం నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్నట్టు సుధా కొంగర టీం ప్రకటించింది.
మిగితా భాషల మాట అటుంచితే తెలుగు వెర్షన్లో మాత్రం సేమ్ టైటిల్ పెట్టడం గందరగోళం నెలకొంది. మరి ఈ రెండు సినిమాలు ఇదే టైటిల్‌తో విడుదలవుతాయా..? లేదంటే ఎవరైనా తగ్గుతారా..? అనేది చూడాల్సి ఉంది.
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్