Jana Nayagan | కోలీవుడ్ స్టార్ యాక్టర్ దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళనాడులో ఓ వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని తన పొలిటికల్ పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తూనే.. మరోవైపు అభిమానుల కోసం సినిమాను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. విజయ్ ప్రస్తుతం దళపతి 69 సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే.
జన నాయగన్ (ప్రజల నాయకుడు) టైటిల్ (Jana Nayagan)తో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు కార్తీ (ఖాకీ) ఫేం హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్‌కు రికార్డు స్థాయిలో ధర వచ్చిందన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
తాజా కథనాల ప్రకారం జననాయగన్ ఓవర్సీస్ రైట్స్‌కు ఏకంగా రూ.75 కోట్లు పలికినట్టు ఇన్సైడ్ టాక్. విజయ్‌కు ఖండాంతరాల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రోడక్షన్ ఈ మూవీని నిర్మిస్తోంది. ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 2025న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
#JanaNayagan Overseas Rights acquired for a record breaking price of 75CR!!
All time record for any Tamil film in Kollywood.
pic.twitter.com/mWDU0NBZgK— Let’s X OTT GLOBAL (@LetsXOtt) January 29, 2025
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి