Thandel | టాలీవుడ్ యాక్టర్ అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం తండేల్ (Thandel). రొమాంటిక్ డ్రామా ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్గా నటిస్తోంది. చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మూవీ లవర్స్, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను వైజాగ్ శ్రీరామ పిక్చర్ ప్యాలెస్ (రామ టాకీస్ రోడ్) వద్ద నిర్వహిస్తున్నామని తెలియజేశారు. జనవరి 28 సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్లో ట్రైలర్ లాంచ్ ఉండబోతుందని ప్రకటించారు మేకర్స్. అయితే ట్రైలర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ ట్రైలర్ ప్రీల్యూడ్ వదిలారు మేకర్స్.
ఈ పండగ నుండి రాజుగాడే మన తండేల్.. అంటూ తండేల్ ట్రైలర్ ప్రీల్యూడ్ లాంచ్ చేశారు మేకర్స్. తండేల్ అంటే రేపు తెలుస్తదని సస్పెన్స్‌లో పెట్టేశారు మేకర్స్. ఇంతకీ తండేల్ అంటే ఏంటనేది తెలియాలంటే ట్రైలర్ (రేపు) వచ్చే దాకా ఆగాల్సిందే మరి.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా ఇది.
#Thandel ante? Repu telustundi…⚓#ThandelTrailer prelude out now!
▶️ https://t.co/SVyw7vvxPKThe most anticipated #ThandelTrailer out tomorrow at 6.03 PM ❤️🔥
Grand Launch Event at Vizag from 5:30 PM Onwards 🔥🔥#ThandelonFeb7th pic.twitter.com/5xRGT5dgXD
— BA Raju’s Team (@baraju_SuperHit) January 27, 2025
Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ