Vaishnavi Chaitanya | బేబి సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya). ఈ భామకు నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్‌తోపాటు ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Baskar) డైరెక్షన్లో డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా నటిస్తోన్న జాక్ ప్రాజెక్టులో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
కాగా ఈ బ్యూటీ ఇటీవలే వర్కవుట్ సెషన్లో పాల్గొన్నది. జిమ్‌లో ట్రైనర్ సమక్షంలో వర్కవుట్ చేస్తూ సైజ్ జీరో ఫిజిక్ కోసం చెమటలు చిందిస్తోంది. వైష్ణవి చైతన్య చిరునవ్వులు చిందిస్తూ సెల్ఫీ దిగింది. వైష్ణవి చైతన్య జిమ్ వేర్లో అందాలు ఆరబోస్తూ నెటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. జిమ్ సెషన్ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే మేకర్స్ జాక్ నుంచి వైష్ణవి చైతన్య బ్లాక్ అవుట్‌ఫిట్‌లో కనిపిస్తున్న లుక్‌ను షేర్ చేశారని తెలిసిందే.ఈ మూవీలో వైష్ణవి చైతన్య ముస్లిం యువతిగా కనిపించనున్నట్టు మేకర్స్. జాక్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గతేడాది చివరగా లవ్ మీ సినిమాలో మెరిసిన ఈ భామ ప్రస్తుతం మరో తెలుగు సినిమాను కూడా లైన్లో పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
జిమ్ సెషన్లో వైష్ణవి చైతన్య..
Vaishnavi chaitanya ❤️
💯🔁💯#VaishnaviChaitanya pic.twitter.com/NDCr6WZi9N
— Celeb_Trendz (@Celeb_Trendz) January 26, 2025
VD14 | రిపబ్లిక్ డే స్పెషల్.. కీ అప్డేట్ షేర్ చేసిన విజయ్ దేవరకొండ టీం
Shafi | పది రోజులుగా వెంటిలేటర్‌పై.. ప్రముఖ దర్శకుడు షఫీ మృతి
SSMB29 Update | సింహన్ని లాక్ చేసిన రాజమౌళి.. SSMB29 ప్రాజెక్ట్ షూరు.!