VD14 | టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రం వీడీ 14 (VD14). టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రిపబ్లిక్ డే సందర్భంగా అభిమానుల కోసం ఆసక్తికర వార్తను షేర్ చేశారు మేకర్స్.
ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఇక ప్రొడక్షన్ దశలోకి వచ్చేసింది.. అంటూ వీడీ 14 పూజా కార్యక్రమాలతో లాంచ్ అయిన విషయాన్ని తెలియజేస్తూ ఫొటోలు షేర్ చేశారు మేకర్స్. వలసరాజ్య చరిత్రను మొదలుపెట్టేందుకు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొదటి అడుగు పడింది.. త్వరలోనే షూటింగ్ మొదలు కానుందని తెలియజేశారు మేకర్స్. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇతిహాసాలు రాయలేదు.. అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి.. అంటూబీటలు వారిన నేలపై గుర్రపు స్వారీ చేస్తున్న ఓ లెజెండ్ విగ్రహాన్ని చూపించగా.. 1854-1878 మధ్యకాలంలో సాగే కథతో సినిమా రాబోతున్నట్టు తెలియజేస్తూ విడుదల చేసిన ప్రీ లుక్ ఒకటి ఇప్పటికే నెట్టింట క్యూరియాసిటీ పెంచేస్తుంది. విజయ్ దేవరకొండ దీంతోపాటు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో తెరకెక్కుతున్న కాప్ డ్రామా ప్రాజెక్ట్ వీడీ 12 (VD12)లో కూడా నటిస్తున్నాడని తెలిసిందే.
Pre-production done. Getting into the exciting production phase.
The set marking puja ceremony of #VD14 was held today.
On our 76th Republic day, the first brick is laid for a great tale on colonial history.Shoot begins soon ❤️🔥@TheDeverakonda @Rahul_Sankrityn… pic.twitter.com/RxlkwkzrYe
— BA Raju’s Team (@baraju_SuperHit) January 26, 2025
VD14 ప్రీ లుక్ ..
Epics are not written, they are etched in the blood of heroes ⚔️
Presenting #VD14 – THE LEGEND OF THE CURSED LAND 🔥
Happy Birthday, @TheDeverakonda ❤️🔥
Directed by @Rahul_Sankrityn
Produced by @MythriOfficial pic.twitter.com/FVorlWkLmd
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2024
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్
SSMB29 Update | సింహన్ని లాక్ చేసిన రాజమౌళి.. SSMB29 ప్రాజెక్ట్ షూరు.!