S.S Rajamouli | టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ను పంచుకున్నారు దర్శకుడు రాజమౌళి.
ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు చెబుతూ.. ఒక వీడియోను విడుదల చేశాడు రాజమౌళి. ఈ వీడియోలో సింహన్ని (మహేశ్ బాబుని) ఎటు వెళ్లకుండా బోన్లో లాక్ చేసినట్లు పాస్‌పోర్ట్ చూపిస్తున్న వీడియో విడుదల చేశారు. దీనికి ‘క్యాప్చర్’ అనే క్యాప్షన్ పెట్టారు. అయితే ఈ వీడియోతొ తాజాగా ఈ మూవీ పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కథానాయికగా ఫిక్స్ అయినట్లు తన పోస్ట్‌తో ఖరారు చేసింది.
మరోవైపు ఈ వీడియోపై మహేశ్ బాబు (Mahesh Babu), ప్రియాంక చోప్రా స్పందించారు. మహేశ్ బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను పోకిరిలోని డైలాగ్‌ను కామెంట్ చేశారు. ప్రియాంకచోప్రా స్పందిస్తూ.. ఫైనల్లీ అంటూ రాసుకోచ్చింది. అడ్వెంచర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథతో వస్తుంది.