Shafi | మలయాళ డైరెక్టర్ షఫీ (Shafi) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ నెల 16 షఫీ (56)కి గుండెపోటు (Heart attack)రాగా.. ఆయన్ను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పది రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్సపొందుతున్న ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించడంతో శనివారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్లు వెల్లడించారు.
ఆడ్యతే కన్మణి సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు షఫీ. ఆయన కెరీర్లో పృథ్విరాజ్ సుకుమారన్, మమ్ముట్టి, కుంచకో బోబన్, బిజూమీనన్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్లలో ఒకరిగా ఓ వెలుగు వెలిగాడు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తీగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
షఫీ సోదరుడు రఫీ.. పాపులర్ రచయిత-దర్శకుల ద్వయం రఫీ-మెకార్టిన్లో ఒకరు కాగా.. షఫీ అంకుల్ దివంగత చిత్రనిర్మాత సిద్ధిఖీ. ఎర్నాకులంలోని Kaloor Muslim Juma Masjidలో సాయంత్రం 4 గంటలకు షఫీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్
SSMB29 Update | సింహన్ని లాక్ చేసిన రాజమౌళి.. SSMB29 ప్రాజెక్ట్ షూరు.!