Pushpa 2 on OTT | అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ఆల్ టైం బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). పుష్ప పార్ట్ 1 (Pushpa The Rise) సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌తో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను తిరగరాసింది. కేవలం హిందీలోనే రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ.1850 (Pushpa 2 Breaks Indian Box Office Records) కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మరోవైపు తాజాగా పుష్ప రీ లోడెడ్ వెర్షన్ (Pushpa 2 reloaded) అంటూ 20 నిమిషాలు అదనంగా జోడించడంతో మళ్లీ థియేటర్లకు క్యూ కడుతున్నారు జనాలు.
ఇదిలావుంటే ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఓటీటీ ప్రేక్షకులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీకి (Pushpa 2 The rule OTT Update) సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం జనవరి 30 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది. థియేటర్ వెర్షన్ 3 గంటలు ఉండగా.. దీనికి 20 నిమిషాలు జోడించి 3 గంటల 40 నిమిషాల రన్ టైంతో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు మేకర్స్.