Chhaava Movie | ఛత్రపతి డ్యాన్స్ ఎలా చేస్తాడు?.. ‘ఛావా’ సినిమా విడుదలను అడ్డుకుంటామన్న మహారాష్ట్ర మంత్రి
Vicky Kaushal | మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం ఛావా. తాజాగా ఈ సినిమా విడుదలను అడ్డుకుంటామని మహారాష్ట్ర మంత్రి వార్నింగ్ ఇచ్చాడు.
Chhaava Movie | భిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తన విలక్షణమైన నటనతో మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నారు బాలీవుడ్ నటుడు నితిన్. గతేడాది సామ్ మానేక్షా బయోపిక్‌తో వచ్చి హిట్ అందుకున్న ఈ హీరో తాజాగా మరో బయోపిక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టుడు విక్కీ కౌశల్ (Vicky Kaushal) టైటిల్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం ఛావా (Chhaava). ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్(Lakshman Utekar) దర్శకత్వం వహిస్తుండగా.. మడాక్ ఫిల్మ్స్ పతాకం పై దినేశ్ విజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్(Chatrapathi Shivaji Maharaj) పెద్ద కుమారుడు శంభాజీ మహరాజ్(Shambaji MAharaaj) జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రాబోతుండగా.. రష్మిక మందన్నా(Rashmika MAndanna) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా వాలంటైన్స్ డే కానుకగా.. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇప్పటికే ట్రైలర్‌ను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న సమయంలో సినిమా విడుదలను అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్.
ఈ సినిమా గురించి ఉదయ్ సమంత్ మాట్లాడుతూ.. ఛావాలో ఛత్రపతి శంభాజీ మహరాజ్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఛత్రపతి డ్యాన్స్ ఎలా చేస్తాడు. దర్శకుడు ఈ భాగాన్ని కట్ చేయాలి. అనంతరం ఈ సినిమాను చరిత్రకారులకి, పండితులకి చూపించాలి.. వాళ్లు ఈ సినిమా చూసి అభ్యంతరాలు వ్యక్తం చేస్తే విడుదల చేయనివ్వబోం అంటూ చెప్పుకోచ్చాడు. కాగా దీనిపై చిత్రబృందం స్పందించాల్సి ఉంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఛత్రపతి శివాజీ మహరాజ్ మరణానంతరం మరాఠా సామ్రాజ్యానికి రాజుగా నియమితులవుతాడు అతడి కుమారుడు శంభాజీ మహరాజ్. అయితే శంభాజీని చంపి మరాఠాను దక్కించుకోవాలని చూస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగజేబు(Mughal Shahenshah Aurangzeb). ఈ క్రమంలోనే ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తుండటంతో ఛావాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

