Apsara Rani | వరుణ్‌సందేశ్, విజయ్‌శంకర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘రాచరికం’ (Racharikam). అప్సరా రాణి (Apsara Rani) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. సురేష్ లంకపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 1న గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే లాంచ్ చేసిన ఈ మూవీ ట్రైలర్క మంచి స్పందన వస్తోంది. తాజా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
తాను సినిమాలు వదిలేయాలనుకున్నానంటూ కామెంట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈవెంట్లో అప్పర రాణి మాట్లాడుతూ.. రాచరికంలో ఇంత మంది పాత్రను ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. నాకు ఒకే రకమైన పాత్రలొస్తున్నాయని సినిమాలు వదిలేయాలనుకున్నా. ఆ టైంలోనే ఆ దేవుడు వీళ్లను నా దగ్గరకు పంపించాడు. విజయ్ శంకర్‌తో రాచరికం సినిమాలో నటించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. రాచరికంలో నెగెటివ్ రోల్ చేశా. మైఖేల్ తర్వాత మళ్లీ ఈ పాత్ర నన్ను ఎక్జయిటింగ్ చేయడం వల్లే సినిమాలో నటించానన్నాడు. రాచరికం టైటిల్లోనే రాయల్టి ఉంటుందని.. రాయలసీమ అంటే ఏంటో ఈ సినిమా చూపిస్తుందని హీరో విజయ్ శంకర్ అన్నాడు. ఈ సినిమాకు రామ్ ప్రసాద్ రాసిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పించేలా సాగుతాయయన్నాడు.
ట్రైలర్లో.. రాచకొండ ఒక అడవి లాంటి దప్పా. ఈడ బలంతో పోరాడే పులులు.. బలగంతో పోరాడే ఏనుగులు.. ఎత్తుకుపైఎత్తేసే గుంట నక్కలు.. కాసుకొని కాటేసే విషసర్పాలుంటాయి. ఆదిపత్యం కోసం జరిగే పోరులో రక్తపాతాలే తప్ప రక్త సంబంధాలుండవంటూ సాగుతున్న డైలాగ్స్ హైప్ పెంచేస్తున్నాయి. సినిమా ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లోని డైలాగ్స్ హింట్ ఇచ్చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. అప్సర రాణి ఓ వైపు గ్లామర్ డోస్ పెంచుతూనే.. మరోవైపు యాక్టింగ్‌తో అదరగొట్టేయబోతున్నట్టు ట్రైలర్ చెబుతోంది.
ఇక వరుణ్ సందేశ్ నయా అవతార్‌లో కనిపిస్తున్నాడు. థ్రిల్లింగ్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ మూవీలో హైపర్ ఆది, రంగస్థలం మహేష్, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రాచరికం ట్రైలర్..
Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ