Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) టైటిల్ రోల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా 2024 జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని తెలిసిందే.
మరి పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్, ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించాడు నాగ్ అశ్విన్. ఈ మూవీ షూటింగ్ 2025 మిడ్ జూన్‌లో మొదలవుతుందని చెప్పి అభిమానులు, మూవీ లవర్స్‌లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు. ఈ ప్రాంఛైజీలో దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రీసెంట్గా తనకు కూతురు పుట్టడంతో నెమ్మదిగా కోలుకుంటోంది దీపికాపదుకొనే . ప్రస్తుతానికి కొత్త సినిమాలకైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
దీపికాపదుకొనే అందుబాటులోకి వచ్చే విషయంపై ఫైనల్ కాల్ రాగానే.. దానికనుగుణంగా కల్కి సీక్వెల్ షూట్ చేయాలని నాగ్ అశ్విన్ టీం ప్లాన్ చేస్తుందట. మొత్తానికి ఈ ఏడాది సెకండాఫ్‌లో కల్కి సీక్వెల్ సెట్స్‌పైకి వెళ్తుందన్న అప్డేట్తో ఫుల్ ఖుషీ అవుతున్నారు అభిమానులు.
ఫస్ట్ పార్ట్‌లో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించారు. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు. మరి సీక్వెల్లో ఎవరెవరు కనిపించబోతున్నారు.. కొత్త పాత్రలు ఏమైనా యాడ్ కాబోతున్నాయా..? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
Pushpa 2 on OTT | ఓటీటీలోకి ‘పుష్ప 2 ది రూల్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
Vaishnavi Chaitanya | జిమ్ సెషన్లో బేబి హీరోయిన్ వైష్ణవి చైతన్య.. వర్కవుట్స్‌తో బిజీబిజీ