నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా నీరందించాలి : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల
ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి అందులోని మొక్కలను పరిశీలించి..
కట్టంగూర్, మార్చి 04 : ప్రస్తుత వేసవిలో నర్సరీల్లో పెంచుతున్న మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరందించాలని కట్టంగూర్ సర్పంచ్ ముక్కామల శ్యామల శేఖర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి అందులోని మొక్కలను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొలకలు రాని బ్యాగ్లలో మళ్లీ గింజలు నాటాలన్నారు. ఎదుగుతున్న మొక్కలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం అంబేద్కర్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి భోజనం, సరుకుల నాణ్యతతో పాటు పౌష్టికాహారాన్ని పరిశీలించి హాజరయ్యే పిల్లల వివరాలను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీలు, బాలింతలతో పాటు పిల్లలకి అందించే పోషకాహారాలను సక్రమంగా అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మెరుగైన సేవలందించాలని పేర్కొన్నారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎరుకల సత్తయ్య, కానుగు వెంకన్న, అంగన్వాడీ టీచర్ ఉన్నారు.

నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా నిరందించాలి : కట్టంగూర్ సర్పంచ్ శ్యామల
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

