Sai Pallavi | అందం, అభినయం, యాక్టింగ్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే అతికొద్ది మంది టాలెంటెడ్ నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). ఈ అమ్మడు హీరోయిన్గా కనిపించబోతుందంటే చాలు ఆ సినిమా దాదాపు హిట్టయినట్టేనని ఫిక్సయిపోతారు మూవీ లవర్స్. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా నటిస్తోన్న తండేల్ (Thandel)లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది సాయిపల్లవి.
చందూమొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇందులో సాయిపల్లవి శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్రలో నటిస్తోంది. సాయిపల్లవి పాత్ర ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోతుందని ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, ట్రైలర్ చెబుతున్నాయి. ఒక్క హిట్ పడితే చాలు హీరోయిన్లు అమాంతం తమ రెమ్యునరేషన్లు పెంచడం చూస్తుంటాం. కానీ సాయిపల్లవి మాత్రం ఎన్ని హిట్స్ వచ్చినా రెమ్యునరేషన్ విషయంలో మాత్రం మార్కెట్‌కు తగ్గట్టుగా డిమాండ్ చేయలేదనే టాక్ కూడా ఉంది.
అయితే ఎవరూ ఊహించని విధంగా తండేల్కు మాత్రం టాప్ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకుంటుందన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. తాజా కథనాల ప్రకారం ఈ చిత్రానికి సాయిపల్లవి ఏకంగా రూ.5 కోట్లు తీసుకుంటుందట. ఇదే నిజమైతే సాయిపల్లవి కెరీర్లోనే అత్యధిక పారితోషికం అని చెప్పొచ్చు.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా వస్తోన్న ఈ మూవీని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. తండేల్ నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
తండేల్ ట్రైలర్..
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి