Ram Gopal Varma | రీసెంట్గా సత్య సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని.. ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రతిజ్ఞ చేశాడని తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘సిండికేట్’ (Syndicate) పేరుతో రామ్‌గోపాల్‌వర్మ కొత్త చిత్రాన్ని కూడా ప్రకటించేసి అందరినీ షాక్‌కు గురి చేశాడు.
అయితే అమితాబ్ బచ్చన్, వెంకటేశ్, ఫహద్ ఫాసిల్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయంలో వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ స్టేట్మెంట్పై స్పష్టత ఇచ్చాడు వర్మ. అవును.. నిజమే నేను సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా. కానీ ప్రొడక్షన్ హౌస్, నటీనటులకు సంబంధించి వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం..అని ట్వీట్ చేశాడు.
‘అత్యంత భయంకరమైన జంతువు ఒక్క మనిషి మాత్రమే’ అనే పాయింట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించి హాట్ టాపిక్‌గా నిలిచాడు.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్నట్టు వార్తలు వస్తుండగా.. త్వరలోనే వర్మ కాంపౌండ్ నుంచి స్పష్టత వచ్చే అవకాశాలున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
Hey, it is true that I am doing the film SYNDICATE but the speculations on the cast and production house is COMPLETELY FALSE https://t.co/43tvhuzVA5
— Ram Gopal Varma (@RGVzoomin) January 30, 2025
ఇదొక ఫ్యూచరిస్టిక్ సినిమా..
‘70 దశకంలో ఉండే వీధి రౌడీలు అనంతరం రాజకీయాలను వృత్తిగా చేపట్టడంతో కనుమరుగయ్యారు. బంగారం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్మగ్లర్లు ఆర్థిక సంస్కరణ వల్ల ఆ వృత్తిని వదిలేశారు. ముంబయి డీ కంపెనీ, ఆల్‌ఖైదా వంటి టెర్రరిస్ట్ సంస్థలు పతనావస్థకు చేరాయి. వీరందరికి కంటే ప్రమాదకరంగా ఇప్పుడు ‘సిండికేట్’ రాబోతున్నది. ఇది రాజకీయ సంస్థలు, రాజకీయాలు, బడా పారిశ్రామిక వేత్తలు, మిలిటరీ కలబోసిన పవర్ఫుల్ ‘సిండికేట్’.
ఆధునిక భారతాన్ని ప్రమాదంలో నెట్టేసే భయంకరమైన కూటమి. నేరం కాలానికి అనుగుణంగా ఎలా రూపాన్ని మార్చుకుంటుందో ఈ సినిమాలో చూడబోతున్నారు. ఇదొక ఫ్యూచరిస్టిక్ సినిమా అనుకోవచ్చు. సమీప భవిష్యత్తుకు అద్దం పడుతుంది. గత కొంతకాలంగా దర్శకుడిగా నేను చేసిన తప్పులను, వైఫల్యాలను ఈ ‘సిండికేట్’ తుడిచి వేస్తుందని వాగ్దానం చేస్తున్నా’ అంటూ ఇప్పటికే తన సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇచ్చేశాడు రామ్‌గోపాల్‌వర్మ.
Sai Pallavi | తండేల్కు సాయిపల్లవి టాప్ రెమ్యునరేషన్.. ఈ సారి నో కాంప్రమైజ్..!
Mazaka | వైజాగ్ రోడ్లపై రావు రమేశ్, సందీప్ కిషన్.. ఇంప్రెసివ్‌గా మజాకా బ్యాచిలర్స్ ఆంథెమ్ సాంగ్