KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం రాశుల వద్ద ఆగి రైతులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రభుత్వం వడ్లు కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనటం లేదని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొస్తే ఇప్పటివరకు ఒక్క గింజ కొన్న పాపానపోలేదని..రైస్ మిల్ కేటాయించపోతే ఎవరు కొనాలి..? ఎలా తూకం వేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దళారులకు అప్పగిస్తే వాళ్లు ఇంత కమిషన్ ఇస్తారు.. అందుకే కొనకుండా వదిలేశారన్నారు. .
రైతుబంధు అని చెప్పి అది కూడా ఇవ్వడం లేదు. సిరిసిల్లలో అధికారులను అడిగితే 1000 క్వింటాళ్లు కూడా వడ్లు కొనలేదని అంటున్నారు. అకాల వర్షం వచ్చి ధాన్యం తడిసిపోయి పాడైపోతుందని రైతులు టార్పిలిన్ కవర్లు కొని కప్పుకుంటున్నారు. ఇంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడా చూడలేదని కేటీఆర్ మండిపడ్డారు.
రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి.. లేదంటే మేము రోడ్డెక్కుతామని కేటీఆర్ రైతులకు భరోసానిచ్చారు. రెండేళ్లలో మళ్లీ మన ప్రభుత్వం వస్తుంది.. ఆ తర్వాత రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని కేటీఆర్ పునరుద్ఘాటించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కేటీఆర్
ఈ ప్రభుత్వం వడ్లు కొంటే మద్దతు ధర, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని కొనటం లేదు
సిరిసిల్ల జిల్లాలో నెల రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకొస్తే ఇప్పటివరకు ఒక్క గింజ కొన్న పాపానపోలేదు
రైస్ మిల్ కేటాయించపోతే… pic.twitter.com/UpIjKrRZi9
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2026
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Arrest | కిడ్నాప్, హత్య కేసులో బెయిల్.. ఆపై పరార్.. 31 ఏళ్ల నాటి కేసులో పట్టుబడ్డ నేరగాడు..!