Arrest : అతడు 31 ఏళ్ల క్రితం ఒక వ్యాపారవేత్త కుమారుడిని కిడ్నాప్ చేసి హతమార్చాడు. కేసు విచారణలో దోషిగా తేలడంతో కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ దొరకింది. బెయిల్ గడువు మునిగిసినా అతడు జైల్లో సరెండర్ కాలేదు. 26 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇటీవల అతడు వివాదాస్పద ప్రకటనలు, ఈ యూట్యూబ్ వీడియోలతో వైరల్‌గా మారాడు. దాంతో పోలీసులు పాత రికార్డులను తిరగదోడి, వేలిముద్రల ఆధారంగా అతడిని గర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకున్నారు.
1995లో ఈశాన్య ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త 13 ఏళ్ల కుమారుడు సందీప్ బన్సల్ కిడ్నాప్‌కు గురయ్యాడు. సలీం వాస్తిక్ అనే వ్యక్తి అతడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ జరిపిన కోర్టు 1997లో అతడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే 2000 ఏడాదిలో ఢిల్లీ హైకోర్టు అతడికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత సలీం పరారయ్యాడు. తిరిగి కోర్టుకు రాలేదు.
అయితే ఇటీవల అతడు వివాదాస్పద కామెంట్లు, యూట్యూబల్లో వీడియోలతో వైరల్‌గా మారాడు. దాంతో పోలీసుల ఆ కేసుకు సంబంధించిన పాత రికార్డులు, వేలిముద్రలు, ఫోటోలను ఉపయోగించి దర్యాప్తు జరిపారు. అతడు 31 నాటి కిడ్నాప్, హత్య కేసు దోషేనని తేలింది. దాంతో పోలీసులు అతడిని లోని పట్టణంలో అరెస్టు చేశారు