Bangladesh | మేం భారత్కు దూరమవ్వాలని అనుకోవట్లేదు.. హసీనా ప్రెస్మీట్ వేళ బంగ్లాదేశ్ కామెంట్
Bangladesh | భారత్ (India) లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheikh Hasina) త్వరలోనే స్వదేశానికి తిరిగెళ్లే యోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు సూచనప్రాయంగా వెల్లడించిన ఆమె.. తాజాగా మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో పత్రికా విలేకరులను ఉద్దేశించి బుధవారం ఆమె ప్రసంగించనున్నారు. దీనిపై బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వం స్పందించింది.
Bangladesh : భారత్ (India) లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh Ex PM) షేక్ హసీనా (Sheikh Hasina) త్వరలోనే స్వదేశానికి తిరిగెళ్లే యోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు సూచనప్రాయంగా వెల్లడించిన ఆమె.. తాజాగా మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో పత్రికా విలేకరులను ఉద్దేశించి బుధవారం ఆమె ప్రసంగించనున్నారు. దీనిపై బంగ్లాదేశ్ (Bangladesh) ప్రభుత్వం స్పందించింది.
పొరుగు దేశం భారత్తో ఉన్న స్నేహపూర్వక సంబంధాలు చెడిపోవాలని తాము కోరుకోవట్లేదని బంగ్లా విదేశాంగశాఖ సహాయ మంత్రి షామా ఒబేద్ అన్నారు. ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పొరుగుదేశం నుంచి హసీనా సహా ఇతర అవామీ లీగ్ నాయకులు రాజకీయ ప్రకటనలు చేయడంపై తమ ఆందోళనలను ఇప్పటికే పలుమార్లు భారత్కు తెలియజేశామని షామా వెల్లడించారు. హసీనా మీడియా సమావేశంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత్ స్పష్టంచేసిన విషయాన్ని ప్రస్తావించారు.
మరోవైపు హసీనా ప్రసంగాలు, ప్రకటనలు, ఇంటర్వ్యూలు, ఆడియో/వీడియో సందేశాలను ప్రచురించడం/ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తమ దేశంలోని మీడియా సంస్థలను హెచ్చరించింది. బంగ్లాలో విద్యార్థుల తిరుగుబాటు ఫలితంగా అధికారాన్ని కోల్పోయి భారత్కు పారిపోయి వచ్చిన అనంతరం హసీనా విలేకరులను ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో ఆమె వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు.
ఇందులో ఆమె బంగ్లాదేశ్కు ఎప్పుడు వెళ్తారనే విషయంతోపాటు భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో హసీనా కుమారుడు సాజీబ్ వాజెద్ ఇతర అవామీ లీగ్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశంతో తమకెలాంటి సంబంధం లేదని భారత విదేశాంగశాఖ (MEA) స్పష్టంచేసింది. దీనిని ఒక ప్రైవేటు మీడియా సంస్థ ఏర్పాటు చేస్తోందని వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

