పాట్నా: బీహార్‌లోని పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 70 నుంచి 80 శాతం మంది రాజకీయ నేతలు అశ్లీల చిత్రాలు చూస్తారని ఆయన ఆరోపించారు. (Pappu Yadav) తన ఫోన్‌తో సహా వారి ఫోన్లలో అలాంటి అశ్లీల కంటెంట్ ఉందో లేదో తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల మహిళా రిజర్వేషన్ల అంశంపై పప్పు యాదవ్ మాట్లాడారు. ‘పురుష నాయకుడి బెడ్రూమ్లోకి వెళ్లకుండా 90 శాతం మంది మహిళలు రాజకీయాల్లోకి ప్రవేశించలేరు’ అని అన్నారు. ఆయన చేసిన లింగవివక్ష వ్యాఖ్యలపై బీహార్ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీస్ జారీ చేసింది.
కాగా, ఈ నోటీస్‌పై పప్పు యాదవ్ బుధవారం స్పందించారు. తన వ్యాఖ్యలను ఆయన సమర్థించుకున్నారు. ‘70 నుంచి 80 శాతం మంది రాజకీయ నాయకులు పోర్న్ చూస్తారని సభలో కూడా నేను చెప్పాను. కాబట్టి అందరినీ తనిఖీ చేయించండి. ఒకవేళ నా ఫోన్లో అశ్లీల చిత్రాలు ఉంటే, నన్ను కూడా తనిఖీ చేయండి’ అని అన్నారు.
మరోవైపు తనకు నోటీస్ జారీ చేసిన బీహార్ మహిళా కమిషన్ సభ్యురాలు సజల్ ఝాపై కూడా పప్పు యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. ‘నాకు నోటీసు పంపిన ఈ వ్యక్తులు ఎవరు? వీరు ఎవరి పక్షాన ఉన్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. మహిళా కమిషన్ సభ్యురాలు సజల్ ఝా పలువురు నాయకులతో ఉన్న ఫొటోలు తన వద్ద ఉన్నాయని, వాటిని బహిరంగపరుస్తానని ఆయన తెలిపారు. ‘మాజీ మంత్రుల ఫొటోలు చాలా ఉన్నాయి. గాజు ఇళ్లలో నివసించేవారు రాళ్లు విసరకూడదు. పురుష రాజకీయ నాయకులు మహిళలను వాడుకోకుండా రాజకీయాల్లోకి రానివ్వరని నేను చెప్పాను. అది తప్పా? నేను మహిళల కోసం పోరాడుతున్నా. వారు మహిళలను దోపిడీ చేస్తారు’ అని ఆయన అన్నారు.
కాగా, తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోందని పప్పు యాదవ్ ప్రశ్నించారు. కొంతమంది రాజకీయ నాయకులు మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు వాదిస్తూనే అదే సమయంలో మహిళలను దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘755 మంది పురుష రాజకీయ నాయకులపై లైంగిక వేధింపుల కేసులు ఉండగా, వారిలో 155 మందిపై ఛార్జిషీట్లు ఉన్నాయి. భారతదేశం మొత్తం కళంకితమైంది. నేను పురుష రాజకీయ నాయకుల గురించి మాట్లాడితే, వారు (మహిళా కమిషన్) ఎందుకు కలవరపడుతున్నారు? ఈ రాజకీయ నాయకులు మహిళలను దోపిడీ చేసి, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్ చట్టం గురించి మాట్లాడతారు’ అని అన్నారు. అయితే పప్పు యాదవ్ వ్యాఖ్యలను కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా విమర్శించాయి.
Also Read:
G Parameshwara | కబడ్డీ ఆటలో పందెం కాసిన హోంమంత్రి.. కేసు నమోదుకు కోర్టు ఆదేశం