టెహ్రాన్: భారత్‌కు వస్తున్న కార్గో షిప్‌తో పాటు మరో నౌకను ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) నౌకాదళం స్వాధీనం చేసుకున్నది. హోర్ముజ్ జలసంధి దాటేందుకు ప్రయత్నించిన ఆ రెండు వాణిజ్య నౌకలను ఇరాన్ తీరానికి తరలించింది. (India-bound ship seized by IRGC) బుధవారం ఉదయం హోర్ముజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నించిన రెండు నౌకలను ఐఆర్జీసీ స్వాధీనం చేసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ‘ఈ ఉదయం హోర్ముజ్ జలసంధిలో నిబంధనలను ఉల్లంఘించిన రెండు నౌకలను ఐఆర్జీసీ నౌకాదళం గుర్తించి నిలిపివేసింది. ఆ రెండు నౌకలను ఐఆర్జీసీ నౌకాదళం స్వాధీనం చేసుకుని ఇరాన్ తీరానికి మళ్లించింది’ అని ఐఆర్జీసీ ప్రకటించిందినట్లు ఏఎఫ్‌ఫీ పేర్కొంది.
కాగా, ఐఆర్జీసీ స్వాధీనం చేసుకున్న రెండు నౌకలను ఎంఎస్సి ఫ్రాన్సెస్కా, ఎపామినోండాస్గా గుర్తించారు. మెరైన్ ట్రాఫిక్ వెబ్సైట్ ప్రకారం ఎపామినోండాస్ నౌక దుబాయ్‌లోని జెబెల్ అలీ నుంచి గుజరాత్‌కు వెళ్తోంది.
మరోవైపు బుధవారం ఉదయం హోర్ముజ్ జలసంధిలో మూడు కంటైనర్ నౌకలపై ఐఆర్జీసీ నౌకాదళం దాడి చేసింది. ఒమన్‌కు ఈశాన్యంగా సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఒక కంటైనర్ నౌకపై ఐఆర్జీసీ గన్‌బోట్ కాల్పులు జరిపినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ (యూకేఎమ్టీఓ) తెలిపింది. గ్రీక్ కంపెనీకి చెందిన ఎపామినోండాస్ నౌకలోని బ్రిడ్జికి నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.
కాగా, ఇరాన్‌కు పశ్చిమాన సుమారు ఎనిమిది నాటికల్ మైళ్ల దూరంలో యూఏఈకి చెందిన సంస్థ యాజమాన్యంలోని పనామా జెండా కలిగిన ‘యూఫోరియా’ నౌకపై కూడా ఐఆర్జీసీ నౌకాదళం దాడి చేసింది. నౌక సిబ్బంది సురక్షితంగా ఉన్నారని, నౌకకు ఎలాంటి నష్టం జరగలేదని యూకేఎమ్టీఓ తెలిపింది.
అలాగే ఇరాన్ తీరానికి సుమారు ఆరు నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న పనామా జెండా కలిగిన ఎంఎస్సి ఫ్రాన్సెస్కా నౌకను కూడా ఐఆర్జీసీ నౌకాదళం లక్ష్యంగా చేసుకున్నది. హోర్ముజ్ జలసంధి నుంచి దక్షిణంగా ఒమన్ గల్ఫ్‌లోకి ప్రయాణిస్తుండగా దాడి చేసింది. ఆ నౌక బాడీ, వసతి సౌకర్యాలకు నష్టం వాటిల్లినట్లు సముద్ర నిఘా సంస్థ ‘వాన్గార్డ్’ పేర్కొంది.
Also Read:
Iran Attack | హర్మూజ్‌లో రెండు నౌకలపై ఇరాన్ దాడులు.. ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనకు నో రెస్పాన్స్
Iran | దిగ్బంధనాన్ని తొలగిస్తేనే శాంతి చర్చలకు వస్తాం.. స్పష్టం చేసిన ఇరాన్
Donald Trump: ఆర్థికంగా కుదేలవుతున్న ఇరాన్.. రోజూ 500 మిలియన్ల డాలర్ల నష్టం: ట్రంప్