వాషింగ్టన్: ఇరాన్ ఆర్ధికంగా కుదేలవుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఆదాయం పడిపోతున్నట్లు ఆచయన చెప్పారు. హోర్ముజ్‌ను తక్షణమే ఓపెన్ చేయాలని ఇరాన్ భావిస్తున్నదని, ఎందుకంటే వాళ్లకు నగదు కొరత ఏర్పడిందన్నారు. ప్రతి రోజూ ఆ దేశం సుమారు 500 మిలియన్ల డాలర్లు నష్టపోతున్నదని ట్రంప్ తెలిపారు. మిలిటరీకి, పోలీసులకు జీతాలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. హోర్ముజ్‌ను మూసిన ఇరాన్ ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఇబ్బందిపడుతున్నట్లు ఆయన తెలిపారు.
జలసంధిని బ్లాకేడ్ చేసినట్లు తాము చెప్పడం వల్లే ఇరాన్ దాన్ని మూయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. వాస్తవానికి నాలుగు రోజుల క్రితం తన వద్దకు కొందరు వచ్చి హోర్ముజ్‌ను ఓపెన్ చేయాలని కోరారని, కానీ ఒకవేళ హోర్ముజ్‌ను తాము ఓపెన్ చేస్తే, అప్పుడు ఇరాన్‌తో డీల్ కుదుర్చుకోలేమన్నారు. ఒకవేళ ఆ దేశాన్ని మొత్తం పేల్చివేస్తే తప్ప మళ్లీ ఆ డీల్ కుదిరే అవకాశం ఉండదని ట్రంప్ అన్నారు.
— Rapid Response 47 (@RapidResponse47) April 22, 2026