SBI Jobs |స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 9124 రెగ్యులర్, బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవి క్లరికల్ కేడర్‌కు చెందిన జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్, సేల్స్) పోస్టులు. వీటిలో 7680 రెగ్యులర్, 1444 బ్యాక్‌లాక్ ఉన్నాయి. తెలంగాణలో 260 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్లైన్లో చేసుకునే దరఖాస్తులకు ఆగస్టు 31 చివరితేదీ.
అర్హతలు
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (Graduation)లో ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాది డిసెంబర్‌లోగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలిలి. 2026, ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 28 ఏండ్లలోపు ఉండాలి. 1998, ఏప్రిల్ 2 నుంచి 2026, ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ వంటి రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ. 750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్సర్వీసెమెన్లకు ఫీజు లేదు.
ఎంపిక
మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ప్రిలిమ్స్ (100 మార్కులు, 60 నిమిషాలు), మెయిన్స్ (200 మార్కులు, 2:40 గంటలు), లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (LLPT) ద్వారా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష నెగెటివ్ మార్కింగ్‌లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. ఎల్ఎల్పీ టెస్ట్ దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన భాషలో నిర్వహిస్తారు. 10/12వ తరగతిలో స్థానిక రాష్ట్ర భాషలో చదివినట్లు సర్టిఫికెట్ ఉంటే ఈ పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది.
చివరితేదీ
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటికి ఆగస్టు 31 చివరితేదీ. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం (తెలంగాణ), అనంతపురం, గుంటూరు/విజయవాడ, వైజాగ్, కడప, కాకినాడ, విజయనగరం, చీరాల, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి (ఆంధ్రప్రదేశ్)ల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఇరత వివరాలు వెబ్సైట్ https://sbi.bank.in/web/careers/current-openingsలో చూడవచ్చు.