Sabitha Indra Reddy | సంక్షేమ పథకాలను తొలగించేందుకే కోర్టు వ్యవహారాల్లో ప్రభుత్వం అలసత్వం : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Sabitha Indra Reddy | మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
హైదరాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సంక్షేమ పథకాల ( Welfare schemes ) పట్ల అనుసరిస్తున్న దగాకోరు విధానాల వల్లే పేదింటి ఆడపిల్లలకు ఆసరాగా నిలిచే ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ పథకాలపై హైకోర్టు ( High Court ) స్టే విధించిందని ఆరోపించారు.
పేద వర్గాలకు ఈ పథకాల ఫలాలు అందకూడదనే దుర్బుద్ధితో, నిధులను ఎగ్గొట్టే కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కోర్టు వ్యవహారాల్లో అలసత్వం వహించిందని విమర్శించారు. హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేస్తామని గతంలో అడ్వొకేట్ జనరల్ స్పష్టం చేసినప్పటికీ, న్యాయస్థానం పలుమార్లు అవకాశం ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడం బాధ్యతారాహిత్యానికి ప్రత్యక్ష నిదర్శనమని ధ్వజమెత్తారు.
గత ఎన్నికల సమయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆర్థిక సాయంతో పాటు అదనంగా తులం బంగారం ఇస్తామని రంగుల హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తులం బంగారం ఇవ్వకపోగా పథకాన్ని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజాదరణ పొందిన పథకాలను పూర్తిగా రూపుమాపే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి నాటకాలకు తెరలేపుతోందని దుయ్యబట్టారు.
2014 నుంచి బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు రూ. 13 వేల కోట్లకు పైగా వెచ్చించి లక్షలాది మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు కొండంత అండగా నిలిచామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రమత్తును వీడి, వచ్చే విచారణ గడువైన సెప్టెంబరు 9 లోగా ఉన్నత న్యాయస్థానంలో బలమైన కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే చట్టసభల ద్వారా ప్రత్యేక చట్టబద్ధత కల్పించి స్టే ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదలయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలోనూ, చట్టసభల్లోనూ పోరాడుతుందని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

