Sensex : భారత స్టాక్ మార్కెట్ గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ మాత్రం నష్టాల్లోనే ముగిసింది. గత రెండు రోజులు స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, గురువారం 30 షేర్ బీఎస్ఈ సెన్సెక్స్ 113.61 పాయింట్లు (0.15 శాతం) లాభపడి 78,079.96 వద్ద ముగిసింది. రోజులో గరిష్టంగా 78,119.39 పాయింట్ల గరిష్టాన్ని, 77,665.89 కనిష్టాన్ని తాకింది. అలా, 453.5 పాయింట్లు కోల్పోయినప్పటికీ, చివరకు లాభాల్లో ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ మాత్రం నష్టాల్లో ముగిసింది.
నిఫ్టీ 40.10 పాయింట్లు (0.16 శాతం) నష్టపోయి, 24,395.85 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్ మాత్రం లాభాల్లోనే ముగిసింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 99.88 పాయింట్లు (0.53 శాతం) లాభపడగా, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ కూడా 31.84 పాయింట్లు (0.35 శాతం) లాభపడింది. నిఫ్టీ రియాల్టీ షేర్లు 0.97 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ షేర్లు 0.84 శాతం లాభపడ్డాయి. అయితే, నిఫ్టీ మెటర్ షేర్లు మాత్రం 1.05 శాతం న ష్టపోయాయి. సెన్సెక్స్ 30లో ఇండిగో, ఎల్ అండ్ టీ, హిందుస్తాన్ యునీలీవర్, బీఈఎల్, ఎన్టీపీసీ లాభపడ్డాయి. వీటిలో ఇండిగో షేర్లు 2.86 శాతం లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, ఇన్ఫోసిస్, టైటాన్ నష్టపోయాయి. అత్యధికంగా ఐసీఐసీఐ షేర్లు 3.71 శాతం పడిపోయాయి.
హార్ముజ్ జలసంధి తెరిచే అంశంపై సందిగ్ధత, క్రూడాయిల్ ధరల పెరుగుదల, అంతర్జాతీయ పరిణామాలు, బ్యాంక్, కన్స్యూమర్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి మూలంగా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. డాలర్‌తో రూపాయి మారక విలువ 12 పైసలు తగ్గి 95.44 వద్ద కొననసాగుతోంది. బ్రెంట్ క్రూడాయిల్ ధర 87.79 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారం ఔన్స్ ధర 4,381.47 డాలర్ల వద్ద కొనసాగుతోంది.