బాలికపై అత్యాచారం కేసులో దోషికి 25 ఏళ్ల కారాగార శిక్ష
బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 25 ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. 30 మే 2020 న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ పై జరిగిన అత్యాచారం కేసులో..
నల్లగొండ, ఆగస్టు 13 : బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి 25 ఏండ్ల కారాగార శిక్ష విధిస్తూ నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. 30 మే 2020 న మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ పై జరిగిన అత్యాచారం కేసులో న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించడం జరిగింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 30 మే 2020 రోజున మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధిత బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ కు చెందిన నిందితుడు మహమ్మద్ జాకీర్ బాబాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. నిందితుడు సదరు బాలికను సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పరచుకుని మిర్యాలగూడెం వచ్చి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేయడం జరిగిందని ఆరోపణ.
ఇట్టి కేసులో విచారణ అనంతరం ప్రాసిక్యూషన్ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సదరు వ్యక్తిని దోషిగా తేల్చుతూ 366(2)(i) కిడ్నాప్ కింద 5 సంవత్సరాలు, సెక్షన్ 3 & 4 ఫోక్స్ యాక్ట్ 2012 కింద 20 సంవత్సరాల కారాగార శిక్ష, మొత్తంగా 25 సంవత్సరాల కారాగార శిక్షను పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి విశ్వనాధ్ కులకర్ణి దిలీప్ రావు విధించడం జరిగింది. అలాగే బాధిత బాలికకు రూ.5 లక్షల కంపెన్సేషన్ న్యాయస్థానం ప్రకటించింది. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ డి.శ్రీనివాస్ రెడ్డి, సీడీఓ బి.అఖిల్, భరోసా లిగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితర అధికారులు కేసు విచారణలో తోడ్పాటు అందించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | ప్రజల కష్టాలు తొలగి, సర్వ సంపదలు చేకూరాలి..రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

