Thief | దొంగలు సాధారణంగా రాత్రులు చోరీకి ప్లాన్ చేసుకుంటారని తెలిసిందే. అందరూ నిద్రపోయిన తర్వాత తమ పని షురూ చేసే దొంగలు గుట్టు చప్పుడు కాకుండా చోరీ ముగించుకుని వెళ్లిపోతుంటారు. అయితే ఈ దొంగ మాత్రం అలా చేయలేదు. రాత్రి పూట ఓ ఇంట్లోకి ప్రవేశించాడు. చోరీ అయిన తర్వాత అదే ఇంట్లో నిశ్చింతగా నిద్రపోయాడు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో వెలుగుచూసింది.
పాతబస్తీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగ బంగారం, ఫోన్లు తీసుకున్నాడు. అయితే అక్కడి నుంచి వెళ్లిపోకుండా హాయిగా చోరీ చేసిన బెడ్ రూంలోనే నిద్రపోయాడు. గంజాయి మత్తులో సోయి లేకుండా పడుకొని ఉన్న దొంగను లేపిన కుటుంబసభ్యులు అతని వివరాలన్నీ ఆరాతీశారు. తాను పక్క గల్లీలో ఉంటానని, రాత్రి ఇక్కడికి వచ్చానని.. ఎలా వచ్చానో సరిగా గుర్తు లేదన్నాడు దొంగ.
ఇతను రాత్రి ఎప్పుడొచ్చాడో తెలియదు.. ఇతడి జేబులో ఉన్న నగలు మా ఇంట్లోనివే. ఫోన్ కూడా ఉంది.. అల్మారా తెరిచి ఉంది.. తర్వాత నేనొచ్చి బంద్ చేశా. మా నాన్న ఫోన్ కూడా ఇతడి దగ్గర పెట్టుకున్నాడు. సెల్ఫ్‌లో నుంచి తీసిన చిల్లర డబ్బులు అతడి పక్కనే ఉన్నయి. అంటూ దొంగ గురించి కుటుంబసభ్యుడు చెబుతుండటం వీడియోలోచూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దొంగతనం చేసి, ఆ ఇంట్లోనే నిద్రపోయిన దొంగ
హైదరాబాద్ – పాతబస్తీలో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన దొంగ
బంగారం, ఫోన్లు తీసుకొని, గంజాయి మత్తులో బెడ్ రూంలోనే పడుకొని దొరికిపోయిన వైనం pic.twitter.com/f8yveNzbAJ
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026
Sukumar | సుకుమార్ కూతురు అరుదైన ఘనత.. సింగర్స్ విభాగంలో ఏకైక విద్యార్థిని!
Earth Quake | లడఖ్‌లో గంటల వ్యవధిలో రెండు భూప్రకంపనలు