BRS leaders | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 13 : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న చౌరస్తాలో శుక్రవారం పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై ఎమ్మెల్యేలుగా గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ మేము పార్టీ మారలేదంటూ బుకాయిస్తున్నారని విమర్శించారు.
మీకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బై ఎలక్షన్కు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ మారలేదని చెప్తున్న మీరు బీఆర్ఎస్ కార్యక్రమాలకు ఎందుకు హాజరుకావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ మారిన తరువాత కనీసం ప్రజల్లో తిరిగే ముఖం కూడా లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని మరోసారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శివరాజ్, కోడం వేంకటేశం, అనీల్ గౌడ్, అఫ్రోజ్, శ్రీనివాసరావు, తదితరులున్నారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!