SP Mahesh Geete | ఎల్లారెడ్డి పేట, ఏప్రిల్ 29: మత్తు పదార్థాలపై గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బీ గీతే పోలీస్ సిబ్బందికి సూచించారు. ఇవాళ ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. పోలీస్ స్టేషన్కి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు నమ్మకం, భరోసా కలిగించాలన్నారు.
స్టేషన్ పరిసరాలు, రికార్డులు, పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల వివరాలతోపాటు గతంలో జరిగిన సంఘటనల వివరాలు,స్టేషన్ల పరిధిలో నమోదు అవుతున్న కేసుల వివరాలు, పెండింగ్ కేసుల వివరాలతోపాటు సిబ్బంది నిర్వహించే విధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పనిసరిగా రౌడీ, హిస్టరీ షీటర్లతోపాటు అనుమానిత వ్యక్తులను తనిఖీ చేస్తూ వారి ప్రస్తుత స్థితిగతులపై అరా తీయాలన్నారు.
మత్తు పదార్థాలపై, సైబర్ నేరాలపై గ్రామాల్లో ప్రజలకు, యువతకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా, సేవించడం, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచుతూ కట్టడి చేయాలన్నారు. అధికారులకు, సిబ్బందికి ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. ఇక్కడ డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, సిబ్బంది ఉన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి