Kaleshwaram Project | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 2 : కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కావాలనే దుష్ప్రచారం చేస్తున్నదని, కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న ఉద్దేశ్యంతో చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరంపై కమిషన్ తప్పుడు రిపోర్టు ఇచ్చిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చార్ సౌ బీస్ హామీలను అమలు చేయలేని రేవంత్ రెడ్డి చేస్తున్న దొంగ చర్యలను అందరూ గమనిస్తున్నారని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరడాన్ని నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఏకకంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. కేసీఆర్, హరీష్ రావుపై కుట్ర చేయాలన్న ఉద్దేశ్యంతోనే కాళేశ్వరంపై కమిషన్ రిపోర్టు ఇచ్చిందని, లక్ష కోట్లు ప్రజాధనం వృధా అయ్యిందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి బిత్తర మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వ్యవసాయాన్ని పండగలా చేశారు..
గత ప్రభుత్వంలో కేసీఆర్ వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యత కల్పించి వ్యవసాయాన్ని పండగలా చేశారన్నారు. సకాలంలో ఎరువులు అందించకపోవడంతో రాష్ట్ర రైతాంగం పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కుటుంబం దోపిడీ చేసిన సొమ్మును ఢిల్లీకి సరఫరా చేస్తున్నదన్నారు. నిండు శాసనసభలో కాళేశ్వరం కమిషన్ కు కేటీఆర్, హరీష్ రావు ఇచ్చిన సమాదానాలు చెంపపట్టులా మారాయన్నారు. అక్బరుద్దీన్ శాసనసభలో రేవంత్ రెడ్డి బట్టలూడదీశాడన్నారు. కాళేశ్వరం అనేది తెలంగాణకు జీవనాధారం వంటిదని, మరమ్మత్తు పనులు చేయకుండా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మీరు శాసనసభలో పెట్టిన కమిషన్ రిపోర్డు మొత్తం బూటకమేనని ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలందరికీ కాళేశ్వరం గొప్పదనాన్ని వివరించి రాబోవు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బొందపెడతామని హెచ్చరించారు.
ప్రజలందరికీ వాస్తవాలు తెలిసిపోతాయని..
టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ.. అసాధ్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి నాలుగున్నర కోట్ల ప్రజలందరి ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అబద్దాల పునాదులపై గెలిచిన రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిండని ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ పై వివరణ ఇస్తున్న హరీష్ రావును అడ్డుకునేందుకు మంత్రివర్గం మొత్తం శ్రమించిందని ఎద్దేవా చేశారు.
హరీష్ రావు వివరణతో ప్రజలందరికీ వాస్తవాలు తెలిసిపోతాయని ఇటువంటి దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సుభిక్షంగా మారిందన్నారు. ఇప్పటికీ కాళేశ్వరం ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయని, మిడ్ మానేరు నుండి రోజుకు 9వేల క్యూసెక్కులు అన్నపూర్ణ ప్రాజెక్టుకు అక్కడి నుండి మల్లన్నసాగర్, కొండపోచమ్మ. హైదరాబాద్ కు తరలిస్తున్నారని గుర్తుచేశారు. 20 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారెజిలు చెక్కు చెదరలేదన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘటనపై ప్రజలందరూ ఏదో ఒక విధ్వంసకర శక్తులు చేసినట్లుగా భావిస్తున్నారని తెలిపారు.
యూరియా కొరతతో రైతులంతా అల్లాడుతుంటే రేవంత్ పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలంతా కేసీఆర్ పాలన బాగుండేనని గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ యూత్ విభాగం పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.90వేల కోట్లు అయితే ఇందులో లక్ష కోట్లు అవినీతి జరిగింది అని కాంగ్రెస్ నేతలు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. పది లక్షల క్యూసెక్కుల నీరు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం నిల్వ ఉందంటే అది కేసీఆర్ ఘనతే అని కొనియాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొనే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని గుర్తుంచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, అర్బన్ బ్యాంకు వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు సత్తార్, జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ ఆకునూరి శంకరయ్య, బొల్లి రామ్మోహన్, కత్తెర వరుణ్, వెంగళ శ్రీనివాస్, దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, రాపెల్లి దినేష్, గుగులోతు రేణుక, గుండ్లపల్లి శ్రీనివాస్, తాటి వెంకన్న, బూర బాబి, తుమ్మ రాజు, సామల శ్రీనివాస్, భూంరెడ్డి, సిరిగిరి మురళి, సయ్యద్ ఆక్రం , మునీర్, తదితర నాయకులున్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత