హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రంజాన్ గిఫ్ట్ ప్యాక్‌లపై మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి అజారుద్దీన్ ఫొటో ముద్రించకపోవడంపై మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్‌పాషా అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 44.57 లక్షల మంది ముస్లిం మైనారిటీల గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ సర్కార్ వ్యవహరించిందని విమర్శించారు. తమది ప్రజాపాలన అని చెప్పుకోవడం తప్ప, ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా గిఫ్ట్ ప్యాక్‌లపై మంత్రి అజారుద్దీన్ ఫొటో ముద్రించి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.