TGBKS | రామగిరి జూన్ 01 : టీబీజీకేఎస్ యూనియన్ బలోపేతానికి ఉప్పుల వెంకటేశ్వర్లు కృషి మరువలేనిదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. ఆదివారం సెంటినరి కాలనీలో సింగరేణి కమ్యూనిటీ హాల్లో వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతిని ఆయన కుటుంబ సభ్యులు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులతో కలిసి పుట్ట మధుకర్ హాజరై చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనేక కష్టాలు ఎదుర్కొని ఒక మంచి సింగరేణి ఉద్యోగిగా అధికారుల, కార్మికుల మన్ననలు పొందిన వ్యక్తి ఉప్పుల వెంకటేశ్వర్లు అని కొనియాడారు.
బొగ్గు ఉత్పత్తిలో భాగంగా విధుల నిర్వహణలో గత ఏడాది ఓసీపీ-2 ప్రాజెక్ట్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి యూనియన్‌కు తీరని లోటన్నారు. టీబీజీకేఎస్ అర్జీ -3 డివిజన్ లోని ఓసీపీ- 2 పిట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు కార్మిక హక్కుల సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినట్లు.. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యూనియన్ సభ్యులు ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గౌతమ్ శంకరయ్య, పూదరి సత్యనారాయణ గౌడ్, శెంకేసి రవీందర్ కుమార్ యాదవ్, అసం తిరుపతి, జవహర్ తదితరులు పాల్గొన్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్‌లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్‌లు.. ‘హౌస్‌ఫుల్ 5’ కొత్త ప్రయోగం!