DCP Karunakar | ఫర్టిలైజర్ సిటీ, జూన్ 4: రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రాబోయే బక్రీద్ సందర్బంగా గోదావరిఖని ఏసీపీ పర్యవేక్షణలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో గోదావరిఖని 1 టౌన్, గోదావరిఖని 2 టౌన్ , రామగుండం సర్కిల్ పరిధిలోని ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మత పెద్దలతో శాంతి సమావేశం (పీస్ కమిటీ) జరిగింది. ఈ సమావేశంకు పెద్దపల్లి డీసీపీ పి కర్ణాకర్ ముఖ్య అతితిగా హాజరై హిందూ, ముస్లిం మత పెద్దలతో మాట్లాడి పోలీసుల తరుపున సూచనలు, సలహాలను తప్పకుండా పాటించాలని డీసీపీ కోరారు.
గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో హిందూ ముస్లిం సోదరులు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ముందుకు వెళుతున్నారని తెలిపారు. ఆయా మతస్తులు పండుగ సందర్భాల్లో అందరూ కలిసి కుటుంబ సభ్యులుగా పాల్గొంటున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా పశువుల రవాణాను అనుమతి లేకుండా చేయొద్దన్నారు. వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ లేకుండా ఎటువంటి ఆవుల రవాణా చేయకూడదని, పశువుల కళేబరాలను, పశువుల వ్యర్ధాలను బయట పడేయకుండా మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసే డిస్పోజల్ వాహనాలు, కవర్లలో మాత్రమే వేయాలన్నారు. అనుమతి లేకుండా ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాలలో పశువుల వధ చేసే వారిపై, పశువులను అక్రమంగా రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విస్తృతమైన పెట్రోలింగ్..
కొంతమంది యువత బక్రీద్ సందర్భంగా అతి ఉత్సాహంతో సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం చేసి అల్లర్లు గొడవలకు పాల్పడే విధంగా కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పశువుల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉండే ప్రాంతాలలో విస్తృతమైన పెట్రోలింగ్ చేయడం జరుగుతుంది అన్నారు. పశువుల అక్రమ రవాణా జరుగుతుందని కొంతమంది చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని సూచించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, తమంతట తాముగా వెళ్లి వాహనాలను ఆపడం గాని పరిశీలించడం గాని చేసి అనవసర ఉద్రిక్తతలకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ సమావేశంలో గోదావరిఖని ఏసీపీఎం రమేష్, సీఐలు ఇంద్రసేనారెడ్డి, ప్రసాద రావు, ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లు రమేష్, భూమేష్, ఎన్టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్, రామగుండం ఎస్ఐ సంధ్యారాణి, హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు