Sonu Sood | మానవత్వం చాటిన సోనూ సూద్..దుబాయ్‌లో చిక్కుకున్నవారికి ఉచిత వసతి
పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అండగా ఉండేందుకు సినీనటుడు సోనూ సూద్ ముందుకు వచ్చారు. దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేసిన ఓ వీడియోలో సోనూ సూద్ తెలియచేశారు.
- దుబాయ్‌లో చిక్కుకున్నవారికి ఉచిత వసతి
ముంబై: పశ్చిమాసియాలో ఘర్షణల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన దృష్ట్యా దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అండగా ఉండేందుకు సినీనటుడు సోనూ సూద్ ముందుకు వచ్చారు. దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఉచిత వసతి సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో పోస్టు చేసిన ఓ వీడియోలో సోనూ సూద్ తెలియచేశారు. విమాన ప్రయాణంలో అవాంఛిత అంతరాయాల మధ్య దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులు ఉచిత వసతిని పొందవచ్చని ఆయన చెప్పారు. యుద్ధం వల్ల చాలా మంది దుబాయ్‌లో చిక్కుకుపోయారు.
అలాంటివారిలో మీరు ఉంటే మేము అందచేసే ఉచిత వసతిని పొందవచ్చు. జాతీయత లేదు, షరతులు లేవు, కేవలం మానవత్వం మాత్రమే. సహాయం పొందాలనుకొనేవారు ఇన్‌స్టాగ్రామ్‌పై డీఎం(డైరెక్ట్ మెసేజ్) చేయవచ్చు అని వీడియోలో సోనూ సూద్ పేర్కొన్నారు. గతంలో కొవిడ్ కాలంలో కూడా సోనూసూద్ మానవతా సహాయం అందచేసి ప్రజల మన్ననలు పొందారు. ఇప్పుడు దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికులకు అండగా నిలబడ్డ ఆయనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

